FASTag | న్యూఢిల్లీ, జూలై 31: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తీసుకొచ్చిన ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా తప్పనిసరిగా అప్డేట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఐదేండ్ల కంటే పాతవైన ఫాస్టాగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. యజమానులు తమ ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్లకు డెడ్‌లైన్‌లోగా లింక్ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాహనాల యాజమానులైతే రిజిస్ట్రేషన్ నంబర్లను 90 రోజుల్లోగా అప్డేట్ చేయాలి. 30 రోజుల గడువులోగా చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు.
ఫాస్టాగ్ ప్రొవైడర్లకు కూడా ఎన్పీసీఐ అదనంగా పలు రూల్స్ తీసుకొచ్చింది. వాహనానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని వెరిఫై చేసి డాటాబేస్‌ను అప్డేట్ చేయాలి. సులభంగా గుర్తించేలా వాహనం ముందు, పక్కవైపు ఫొటోలను స్పష్టంగా అప్లోడ్ చేయాలి.