శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడికి కారకులైన ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్ శివారులో ఎదురుకాల్పుల్లో హతమైనట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం పట్ల జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.‘నేను వాళ్లను చూడలేదు.
వారెవరో కూడా నాకు తెలియదు. వారిని చూసిన వారే ఆ ఉగ్రవాదులను గుర్తుపట్టగలరు’ అని ఆయన అన్నారు. ‘వాళ్లు నిజంగా అదే ఉగ్రవాదులైతే మంచిదే. ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదని వారికి పాఠం నేర్పించారు’ అని పేర్కొన్నారు.