శ్రీనగర్లో పోలీస్ బస్సుపై జరిగిన ఉగ్రదాడి అత్యంత దురదృష్టకరమైన ఘటన అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఈ దాడిలో అమరులైన పోలీసులకు సంతాపాన్ని ప్రకటించారు. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, మన జవాన్లనే చంపిన చైనాతో మాత్రం చర్చలు జరుపుతారు కానీ, పాకిస్తాన్తో ఎందుకు చర్చలు జరపరని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. వారి మనస్సులను దోచుకునేలా ప్రవర్తించినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.