దేశవ్యాప్త బీజేపీ శాసనసభ్యుల ఇండ్ల వెలుపల రేపు రైతుల నిరసన

ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం ఈ పిలుపునిచ్చింది. ఈ చట్టాలను కేంద్రం ఆర్డినెన్స్లుగా ప్రకటించి ఏడాది గడుస్తున్న సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు బీకేయూ ఆఫీస్ బేరర్ తెలిపారు.
ఎక్కడైతే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని చోట రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు అదేవిధంగా సంబంధిత చట్టాల కాపీలను కాల్చివేయనున్నట్లు బీకేయూ మీడియా ఇన్ఛార్జి ధర్మేంద్ర మాలిక్ చెప్పారు. రైతు సంఘాల నాయకుల ఇటీవల సమావేశంలో జూన్ 5 నిరసన కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు నవంబర్ 2020 నుంచి ఆందోనలకు దిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

