భోపాల్: ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. (Farmer Family Crawls On Knees) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖతేగాన్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు, తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి దేవాస్‌లోని డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి శుక్రవారం చేరుకున్నాడు. తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా, పంట పండించకుండా పొరుగు రైతు అడ్డుకుంటున్నట్లు ఆరోపించాడు.
కాగా, అధికారులకు ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతు లక్ష్మణ్ విమర్శించాడు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి మోకాళ్లపై నడిచి నిరసన తెలిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రియా చంద్రావత్ ఈ సంఘటనపై స్పందించారు. పొరుగువారిపై సివిల్ కోర్టులో కేసు వేసిన ఆ రైతు ఓడిపోయినట్లు తెలిపారు. అయితే అధికారులను అక్కడకు పంపి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
Dewas से हैरान करने वाला वीडियो, पत्नी-बच्चों के साथ घुटनों के बल अफसर के पास फरियाद करने पहुंचा किसान ! MP Tak pic.twitter.com/3jy6qh648u
— MP Tak (@MPTakOfficial) December 12, 2024