జగత్సింగ్పూర్, జనవరి 24: అమ్మాయిలందరికీ బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే అంటూ ఓ కళాశాల పేరిట ఉన్న నోటీసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఫిబ్రవరి 14 వరకు అమ్మాయిలు అందరికీ ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాలి. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. సింగిల్ అమ్మాయిలకు కళాశాలలోకి ప్రవేశం ఉండదు. బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన తాజా ఫొటో చూపించాలి. ప్రేమను పంచండి’ అని ఆ నోటీసులో ఉంది. ఒడిశాలోని జగత్సింగ్పూర్లో గల స్వామి వివేకానంద మెమోరియల్ కాలేజీ పేరిట ఈ నోటీసు వైరల్ అయింది. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం కూడా ఉంది. కాగా, ఈ నోటీసు తమది కాదని ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.