భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో నకిలీ ఆవ విత్తనాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) క్వింటాల్‌కు రూ.2,650 చొప్పున ఈ విత్తనాలను కొనుగోలు చేసింది. వీటిలో 40 శాతం కేవలం మట్టి ఉండలు అని తేలింది.
2024-25 రబీ సీజన్ కోసం తమ ఆర్డర్‌ను తీసుకునేటపుడు ఓ ట్రేడింగ్ కంపెనీ ఈ దారుణాన్ని గుర్తించింది. నాఫెడ్ కొనుగోలు చేసిన సుమారు 9,000 క్వింటాళ్ల ఆవాల విత్తనాల్లో చాలా వరకు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ కేసులో ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1 కోటి నష్టం జరిగింది. అంతే కాకుండా ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.