న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు ప్రజల డబ్బులు కొల్లగొట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పోస్టాఫీసు పేరుతో వేల మందికి ఎక్స్‌లో ఫేక్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీ ప్యాకేజీ గోదాముకు చేరుకున్నదని, దానిని మీరు పొందడానికి 48 గంటల్లోగా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ ఫేక్ మెసేజ్ లింకును వినియోగదారులు ఓపెన్ చేయవద్దని, పొరపాటున ఓపెన్‌చేస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. పార్సిల్ డెలివరీ కోసం అడ్రస్ అప్డేట్ కోరుతూ భారత తపాలాశాఖ ఎప్పుడూ ఇలాంటి మెసేజ్‌లను పంపబోదని స్పష్టంచేసింది. నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.