సూరత్, నవంబర్ 19: ఫేక్ టోల్ ప్లాజా, ఫేక్ బ్యాంకు, ఫేక్ పోలీస్ స్టేషన్ తర్వాత గుజరాత్లో ఫేక్ మల్టీ స్పెషాలిటీ దవాఖాన వెలుగులోకి వచ్చింది. సూరత్‌లో ఒక మల్టీ స్పెషాల్టీ దవాఖానను కొందరు వైద్యుల బృందం ఆదివారం అట్టహాసంగా ప్రారంభించింది.
దవాఖాన ప్రారంభోత్సవ ఆహ్వానంలో ప్రముఖుల పేర్లు ముద్రించారు. అయితే అది ప్రారంభమై 24 గంటలు కూడా కాకముందే దానిని అధికారులు సీజ్ చేశారు. ఇంత హడావిడిగా ప్రారంభించిన దవాఖానలోని డాక్టర్లలో ఎక్కువ మంది నకిలీలు కావడమే దానికి కారణం.