తిరువనంతపురం: ఒక నకిలీ పోలీస్ ఏకంగా రియల్ పోలీస్‌కు వీడియో కాల్ చేశాడు. (Fake Cop Video Calls Real Cyber Police) ఆయన పోలీస్ అధికారి అని తెలుసుకుని అతడు షాక్ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారికి నకిలీ పోలీస్ నుంచి వీడియో కాల్ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నట్లు అతడు చెప్పాడు. ‘హలో, మీరు ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించాడు.
కాగా, నకిలీ పోలీస్ వీడియో కాల్‌ను కేరళ సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారి పసిగట్టారు. దీంతో నవ్వుతూ అతడితో మాట్లాడారు. తన లొకేషన్ వెల్లడించడానికి తన కెమెరా సరిగ్గా పనిచేయడం లేదని బదులిచ్చారు. ఆ తర్వాత మొబైల్లోని కెమెరాను ఆన్ చేశారు.
మరోవైపు రియల్ పోలీస్‌కు వీడియో కాల్ చేసినట్లు తెలుసుకున్న నకిలీ పోలీస్ వ్యక్తి షాక్ అయ్యాడు. నవ్వుతూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే నకిలీ పోలీస్ వివరాలను ఆ పోలీస్ అధికారి వెంటనే సేకరించారు. దీని గురించి అతడికి చెప్పడంతో కంగుతిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది తెలియలేదు.
కాగా, ఫన్నీగా ఎడిట్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను త్రిసూర్ సిటీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నకిలీ పోలీస్‌కు షాక్ ఇచ్చిన కేరళ పోలీస్ అధికారిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సైబర్ నేరగాళ్ల భరతం పట్టాలని కొందరు సూచించారు.