న్యూఢిల్లీ : చౌక ధరల దుకాణాల డీలర్ల కమీషన్ను కేజీకి 10 పైసలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని డీలర్ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన సార్ధక్ పీడీఎస్ పథకానికి రూ. 23,330 కోట్లు కేటాయిస్తూ డీలర్ల పట్ల ఇంత వివక్షతో వ్యవహరించిన కేంద్రం చర్యను వారు తప్పుబట్టారు.
పెంచిన స్వల్ప కమీషన్లో ప్రస్తుతం పెరిగిపోయిన రవాణా, నిర్వహణ వ్యయాలను భరించడం డీలర్లకు సాధ్యం కాదని, ఇది వారికి ఎంతమాత్రం సరిపోదని స్పష్టం చేసింది.