Fadnavis : అధికార బీజేపీ ఎన్నికల సంఘం (Election Commission) తో కుమ్మక్కై ఓట్ల అవకతవకలకు పాల్పడినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు. రాహుల్ గాంధీ ఒక అబద్ధాల కోరు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తోసిపుచ్చారు.
సోమవారం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నారన్నారు. రాహుల్ వట్టి అబద్దాల కోరని, ఆయన నిరంతరం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాహుల్ మాట్లాడేదంతా అక్షర సత్యమని కొందరు రాష్ట్ర నాయకులు నమ్మడం తనను కలచివేసిందని చెప్పారు.
తప్పుడు సమాచారానికి ఆధారాలుండవని, అబద్ధాలపై నిర్మించిన కోట ఎన్నటికీ నిలువదని, అది కచ్చితంగా కూలిపోతుందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లు గెలువాలంటే వారి నమ్మకాన్ని సంపాదించాలనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించలేకపోతున్నారని అన్నారు.