Himachal Pradesh Rains | హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్డా జిల్లాలోని ధర్మశాల, పాలంపూర్ ల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొండ చరియలు విరిగే పడే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు 150 రహదారులను మూసేశారు. మండి జిల్లాలో 111, సిర్ మౌర్ లో 13, సిమ్లాలో తొమ్మిది, చంబా, కులులో 8, కాంగ్డా జిల్లాల్లో ఒక్కో రోడ్డు మూసేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలపై కేంద్రం కూడా స్పందించింది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే సహాయ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 334 ట్రాన్స్ ఫార్మర్లు పాడవ్వగా, 55 తాగునీటి సరఫరా పథకాల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికార వర్గాలు తెలిపాయి.
ధర్మశాలలో గరిష్టంగా 214.6 మి.మీ వర్షపాతం రికార్డవ్వగా, పాలంపూర్ లో 212.4 మి.మీ, జోగిందర్ నగర్ లో 169 మి.మీ. కాంగ్డా పట్టణంలో 157.6 మి.మీ, బైజ్యనాథ్ లో 142 మి.మీ, జోత్ లో 95.2 మి.మీ, నగ్రోటా సూరియన్ లో 90.2, సుజన్ పూర్ లో 72 మి.మీ, దౌలాఖాన్ లో 70, ఘమ్ రర్ లో 68.2 మి.మీ, నాదౌన్ లో 63 మి.మీ, బెర్తిన్ లో 58.2 మి.మీ వర్షపాతం రికార్డయింది. టూరిస్ట్ ప్రాంతాలైన డల్హౌసిలో 31 మి.మీ, మనాలీలో 30 మి.మీ, కౌసౌలిలో 24 మి.మీ వర్షపాతం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 12 వరకూ సిమ్లాలోని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!