లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త ఇది! లోక్సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, వారి పిల్లలకు పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తామని కొన్ని కళాశాలలు ప్రకటించాయి. సెయింట్ జోసఫ్ కాలేజ్ విడుదల చేసిన ప్రకటనలో తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఓటు వేసిన అనంతరం కళాశాలకు వచ్చి, వేలికిగల సిరా గుర్తును చూపిస్తే, ఆ విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 10 మార్కులను వేస్తామని తెలిపింది. క్రైస్ట్ చర్చ్ కాలేజీ అయితే ఏకంగా 20 మార్కులు వేస్తామని చెప్పింది.