S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పీఓకేపై నియంత్రణ కోల్పోయాం.. నెహ్రూపై విదేశాంగ మంత్రి పరోక్ష విమర్శలు..!
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
S Jaishankar | పాక్ ఆక్రమిత కశ్మీర్( పీఓకే)పై భారత్ తాత్కాలికంగా నియంత్రణ కోల్పోవడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరెత్తకుండానే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులే కారణం అని పేర్కొన్నారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణం అని తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి జైశంకర్ పరోక్ష ఆరోపణలు చేశారు. ‘విశ్వబంధు భారత్’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు. భారత్‌లో పీఓకే అంతర్భాగం అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపనలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

