బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో బాంబు దాడి జరిగింది. అయితే సీఎం నితీశ్ క్షేమంగానే ఉన్నారని పోలీసులు ప్రకటించారు. నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నారు. ఈ సమయంలోనే బాంబు దాడి జరిగింది. సీఎం నితీశ్ ఉన్న ప్రాంతానికి కేవలం 18 ఫీట్ల దూరంలోనే ఈ దాడి జరగడం కలకలం రేపింది. మరో వైపు పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది బాంబు దాడి కాదని.. కొందరు వ్యక్తులు టపాకాయలు పేల్చారన్నది మరో వాదన. ఇస్లాంపూర్ సత్యర్ గంజ్‌కు చెందిన ఓ వ్యక్తి టపాకాయలు కాల్చారన్నది వారి వాదన. ఏది ఏమైనా సీఎం నితీశ్ పాల్గొన్న సభలో, అది కూడా ఆయనకు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు సీఎం నితీశ్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. భక్తియార్ పూర్లో ఈ ఘటన జరిగింది. సీఎం నితీశ్ ఓ విగ్రహానికి పూల మాల వేస్తుండగా, సెక్యూరిటీని తప్పించుకొని, ఓ యువకుడు సీఎం నితీశ్‌ను వెనకనుంచి దాడి చేశాడు. దీంతో పోలీసులు అలర్ట్ అయి, ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.