న్యూఢిల్లీ: బెయిల్ దరఖాస్తులు స్వేచ్ఛకు సంబంధించినవని, వాటిపై హైకోర్టులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక కేసు నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడి పిటిషన్ను విచారణకు లిస్టింగ్ చేయాలని బెంచ్ ఈ సందర్భంగా హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో పిటిషన్ విచారణ తేదీని వెల్లడించలేదని పేర్కొన్నది.