నాసిక్: బీజేపీ వ్యవహార శైలిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి పంకజ్ ముండే అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడటం కంటే రాజకీయాల నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించడమే ఉత్తమమని సోమవారం నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె నేరుగా ఎవరిపైనా విమర్శలు చేయకపోయినప్పటికీ బీజేపీ తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతున్నది. రాజకీయాల్లో మీకు మరిన్ని అవకాశాలు ఎందుకు రావడం లేదని మద్దతుదారులు ప్రశ్నించినప్పుడు.. ‘ఆ విషయాన్ని నేనెలా చెప్పగలను’ అని పంకజ్ ముండే ఎదురు ప్రశ్న వేశారు. అవకాశాలు ఇస్తున్నవారిని, ఇవ్వనివారినే ప్రశ్నించాలని మద్దతుదారులకు సూచించారు.