న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. తప్పుడు ధ్రువపత్రాలతో ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ప్రయత్నించారని ఆమెపై ఈ ఏడాది జూన్, ఆగస్ట్‌లో అభియోగాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఆమె ఉద్దేశం యూపీఎస్సీ అధికారులను మోసం చేయడమేనని.. ఇందుకు ఆమె వేసిన ఎత్తుగడలు పెద్ద కుట్రలో భాగమని కోర్టు పేర్కొంది. ఆమెపై నమోదైన ఫోర్జరీ, మోసం అభియోగాలు అధికారులనే కాకుండా దేశాన్ని మోసగించడంలో నూ చక్కని ఉదాహరణగా ఉపయోగపడతాయని కోర్టు వ్యాఖ్యానించింది.