న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన విధ్వంసకాండ సందర్భంగా ఢిల్లీలోని సరస్వతీ విహార్‌లో ఇద్దరు వ్యక్తుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 18న శిక్షను ఖరారు చేయనున్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. 1984 నవంబర్ 1న జస్వంత్‌సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ హత్యకు గురయ్యారు.