సిమ్లా: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (Ex-Congress MLA shot) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ తన నివాస ప్రాంగణంలో కూర్చొన్నారు.
కాగా, సాయుధులైన నలుగురు వ్యక్తులు కాంగ్రెస్ నేత ఠాకూర్ నివాసంలోకి చొరబడ్డారు. ఆయనతోపాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన ఠాకూర్‌ను సిమ్లాలోని ఐజీఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ కాల్పుల సంఘటనపై స్పందించారు. గాయపడిన మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ఠాకూర్ అధికార నివాస ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Breaking News: Congress leader and former MLA Bamber Thakur and his PSO were shot at by unidentified assailants at his residence in #Bilaspur. The attack took place earlier today, with reports indicating that approximately 12 rounds of bullets were fired during the assault. pic.twitter.com/IhRLRkZhMD
— Himachal Watcher (@HimachalW) March 14, 2025