Turkey | క్షమా గుణం… అన్ని గుణాల్లో కెల్లా ఉత్తమమైన గుణం. ఇతరులు తప్పు చేసి, పశ్చాత్తాపపడితే.. క్షమించే గుణం ఉంటే ఆ వ్యక్తి ఉత్తముడు. టర్కీలో ఓ సంఘటన జరిగింది. తనపై యాసిడ్ పోసి, జీవితాన్ని సర్వ నాశనం చేసిన యువకుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే, పెళ్లికి ఒప్పుకుంది ఓ యువతి. ఇలా ప్రేమకు ఓ ఉన్నత వ్యక్తిత్వాన్ని అద్దిన యువతి పేరు బేర్ఫిన్ ఓజెక్. బేర్ఫిన్, ఓజెన్ సెల్టీ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే సెల్టీ ఓ రోజు ఆ అమ్మాయిపై యాసిడ్ దాడి చేశాడు. ఈ యాసిడ్ దాడి జరిగి 20 ఏళ్లు గడిచిపోయాయి. 20 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ యువకుడు ఆమెను క్షమాపణ కోరాడు. తాను చేసిన విషయానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని ఆ యువతితో చెప్పాడు. ఆ యువతి అతడ్ని క్షమించింది. అతడితోనే పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా నిశ్చయించుకుంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి చేసిన పనిని కొందరు పొగుడుతుంటే.. మరి కొందరు విమర్శిస్తున్నారు. అయితే ‘ఆ యువకుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు… పెళ్లి చేసుకున్నాను’ అని ఆ యువతి కరాఖండిగా పేర్కొనడం విశేషం.