పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్ధేశాయ్ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో శనివారం భేటీ అయ్యారు. విపక్షాలు ఐక్యంగా పోరాడితేనే బీజేపీని నిలువరించవచ్చని ఈ సందర్భంగా విజయ్ సర్ధేశాయ్ స్పష్టం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో కలిసి పనిచేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.
గోవా అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలున్న సర్ధేశాయ్ పార్టీ గోవా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్ష కూటమి బలోపేతానికి పనిచేసే పార్టీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాగా సర్ధేశాయ్తో భేటీ అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా ఇరు పార్టీలు సమైక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయని మమతా బెనర్జీ వెల్లడించారు.