న్యూఢిల్లీ : ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోల(EVMs Color Photso)ను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలు ఈవీఎం మెషీన్లపై ఉంటాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా జరిగే అనేక కొత్త మార్పులను సీఈసీ ఇవాళ వెల్లడించారు. ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి గురించి అప్డేట్ ఉంటుందన్నారు.
ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ యాప్లో ఓటింగ్ డేటా అప్డేట్ అవుతుందని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను కొత్తగా ఇవ్వనున్నామని, ఆ స్లిప్స్పై ఓటరు ఐడీ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా 1200 ఓటర్లు మాత్రమే పోలింగ్ చేసే రీతిలో ఏర్పాట్లు చేశామన్నారు.
#Bihar First Initiatives – Conduct of Elections #BiharElections2025 pic.twitter.com/Rr8t8dytmd
— Election Commission of India (@ECISVEEP) October 6, 2025