West Bengal Polls: ఈవీఎం బటన్‌కు టేపులు వేస్తే రీపోలింగ్: బెంగాల్ ఎన్నికల అధికారి
West Bengal Elections: బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని ఫాల్టా పోలింగ్ బూత్‌లో ఓ ఈవీఎం బటన్‌కు టేపు వేశారు. ఈ ఘటనపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఈవీఎం బటన్లకు టేపు వేసినట్లు ఉంటే, అక్కడ మళ్లీ పోలింగ్ చేపడుతామని ఎన్నికల అధికారి తెలిపారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓటింగ్(West Bengal Polls) అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాల్టాలో ఈవీఎంల బటన్లకు టేపు వేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పందించారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం బటన్‌ను ట్యాంపర్ చేస్తే, ఆ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు ఓటర్లను అడ్డుకుంటున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల బటన్లకు టేపులు వేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇలాంటి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలోనే పరిశీలించనున్నట్లు సీఈసీ తెలిపారు.
బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ వివాదానికి తెరలేపారు. ఫాల్టాలోని అనేక పోలింగ్ బూతుల్లో తమ పార్టీకి ఓటు వేసే ఆప్షన్‌ను బ్లాక్ చేశారన్నారు. ఈవీఎం బటన్‌పై టేపు వేసి ఓటు వేయకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో మాల్వియా స్పందిస్తూ ఇది డైమండ్ హార్బర్ మోడల్ అని విమర్శించారు. ఈవీఎం బటన్లకు టేపు వేసిన పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ కుమార్ హాల్దర్, టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే పన్నాలాల్ హాల్దర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పన్నా లాల్ 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
డైమండ్ హార్బర్ మోడల్ అన్న టైటిల్‌తో బీజేపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈవీఎంపై ఉన్న ఆ పార్టీ బటన్‌ను టేపుతో బ్లాక్ చేశారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటల వరకు రెండో దశలో సుమారు 40 శాతం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే పుర్బా బర్దమాన్‌లో 44.50 శాతం, హూగ్లీలో 43.12 శాతం, కోల్‌కతా నార్త్‌లో 38.39 శాతం, కోల్‌కతా సౌత్‌లో 36.78 శాతం ఓట్లు పోలయ్యాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.
This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.
In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86
— Amit Malviya (@amitmalviya) April 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

