Congress Party: ఆ భవనం ఖాళీ చేయండి.. కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ
Congress Party : ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఎస్టేట్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 28వ తేదీ లోగా ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దాదాపు 48 ఏళ్ల పాటు అక్బర్ రోడ్డులోని భవనం కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా సేవలు అందించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఎస్టేట్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న ఆఫీసును మార్చి 28వ తేదీ లోగా ఖాళీ చేయాలని నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 48 ఏళ్ల పాటు అక్బర్ రోడ్డులోని భవనం కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా సేవలు అందించింది. కోట్లా మార్గ్‌లో గత ఏడాది కాంగ్రెస్ పార్టీ కొత్త భవనాన్ని ప్రారంభించింది. ఇందిరా భవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్బర్ రోడ్డులో ఉన్న ఆఫీసును ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అక్బర్ రోడ్డు బిల్డింగ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా చాన్నాళ్లు పనిచేసింది. కొత్త ఆఫీసును ఓపెన్ చేసినా.. ఇంకా పాత కార్యాలయాన్ని వాడడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. అక్బర్ రోడ్డులో ఉన్న ఆఫీసుకు పెద్ద చరిత్రే ఉన్నది. రాజకీయంగా, చరిత్రాత్మకంగా ఆ బిల్డింగ్‌కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. స్వాతంత్య్రం రావడానికి ముందు ఆ ప్రాపర్టీని బ్రిటీష్ వైస్రాయ్ సర్ రెజినాల్డ్ మ్యాక్స్‌వెల్ నివాసంగా వాడుకున్నారు. మయన్మార్ అంబాసిడర్ దా ఖిన్ కియా నివాసంగా కూడా వినియోగించారు. ఈ ఇంట్లోనే ఆయన కూతురు ఆంగ్‌సాన్ సూకీ కూడా తన బాల్యాన్ని గడిపారు.
ఇక 1977లో ఓటమి తర్వాత ఇందిరా గాంధీ ఈ బిల్డింగ్ నుంచి మళ్లీ తన సమరాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆ బిల్డింగ్.. పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ కూడా ఈ కార్యాలయం నుంచే ఎదిగారు.
#WATCH | Over notice to Congress to vacate its 24 Akbar Road office, party MP Pramod Tiwari says,” The BJP government is not a democratic govt. It is unfortunate. Let the notice reach us. We will act on it after holding discussions.” pic.twitter.com/S1jKMEYBb2
— ANI (@ANI) March 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

