ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ)ను ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవైలో కలపాలని ఈఎస్ఐసీ వైద్య ప్రయోజన మండలి నిర్ణయించింది. ఢిల్లీలోని ఈఎస్ఐసీ కార్యాలయంలో జరిగిన 86వ వైద్య ప్రయోజన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
వైద్య ప్రయోజన మండలి నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ)ను ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవైలో కలపాలని ఈఎస్ఐసీ వైద్య ప్రయోజన మండలి నిర్ణయించింది. ఢిల్లీలోని ఈఎస్ఐసీ కార్యాలయంలో జరిగిన 86వ వైద్య ప్రయోజన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈఎస్ఐను ఆయుష్మాన్ భారత్లో కలపడం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని మండలి అభిప్రాయపడింది.