న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వచ్చే ఏడాది జనవరి నుంచి తన సభ్యులకు ఏటీఎం విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కల్పించే అవకాశం ఉంది. అక్టోబర్ రెండవ వారంలో బోర్డు సమావేశంలో ఈ కొత్త సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓకి చెందిన నిర్ణయాక విభాగం సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(పసీబీటీ) తీసుకునే అవకాశం ఉంది.
అటువంటి లావాదేవీలను అమలుచేసే సామర్థ్యం ఈపీఎఫ్ఓకి చెందిన ఐటీ వ్యవస్థకు ఉందని సీబీటీ సభ్యుడు ఒకరు తెలిపారు. అయితే, ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రాయల్‌కు పరిమితి ఉంటుందని స్పష్టం చేశారు.