EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతున్నది. 2-3 నెలల్లో ఈ సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇప్పటివరకు ఖాతాదారుల క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత బ్యాంకు అకౌంట్లకు డబ్బులు వచ్చేవి. దీనికి రెండు మూడు రోజులు పట్టేది. కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల ఐడీకే పీఎఫ్ సొమ్ము వస్తుంది. దీంతో క్లెయిమ్ సెటిల్ అయిన వెంటనే ఖాతాదారులకు డబ్బులు అందుతాయి.