‘చెప్పింది చాలు నోరు ముయ్యి’… చనిపోయిన బాలుడి తల్లిపై అధికారిణి అరుపులు
లక్నో: ‘చెప్పింది చాలు నోరు ముయ్యి…’ అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై ప్రభుత్వ అధికారిణి విరుచుకుపడింది. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. మోదీనగర్‌కు చెందిన నాలుగో తరగతి విద్యార్థి అనురాగ్ భరద్వాజ్, బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్తుండగా వాంతులయ్యాయి. దీంతో బస్సు కిటికీ నుంచి వాంతి చేసుకున్నాడు. బస్సు డ్రైవర్ దీనిని గమనించలేదు. ఈ నేపథ్యంలో ఒక స్తంభానికి విద్యార్థి తల ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి స్కూల్ బస్సు డ్రైవర్, మరో బస్సు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్కూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాగా, మరణించిన విద్యార్థి అనురాగ్ తల్లిదండ్రులు గురువారం కొంతమంది పేరెంట్స్, స్థానికులతో కలిసి ఆ స్కూల్ ఎదుట నిరసన తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడకు వచ్చారు. కుమారుడి మృతిపై బాధను వ్యక్తం చేస్తున్న తల్లిపై ఆమె మండిపడ్డారు. ‘చెప్పింది చాలు నోరు ముయ్యి’ అని వేలు చూపించి ఆమెపై అరిచారు. ‘నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. అయితే చనిపోయింది నీ కుమారుడు కాదుగా అని అనురాగ్ తల్లి నేహా ఏడుస్తూ అన్నది. ‘నా కుమారుడు మరణించడాన్ని నేను చాలా అర్థం చేసుకున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీంతో బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై నివేదిక కోరారు. ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని తెలియడంతో అన్ని స్కూల్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

