చెన్నై: నిశ్చితార్థం రద్దు కావడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. కాబోయే భార్యపై కత్తితో దాడి చేశాడు. అయితే కాపాడే ప్రయత్నంలో ఆమె తల్లి మరణించింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Attacks Fiancee) తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల యువరాజ్, 21 ఏళ్ల వర్షకు కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. అయితే వయసులో 11 ఏళ్లు గ్యాప్ ఉండటంతో బంధువైన అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దు చేశారు.
కాగా, యువరాజ్ దీనిపై ఆగ్రహించాడు. వర్ష కుటుంబం నివసించే ఇంట్లోకి బలవతంగా ప్రవేశించాడు. కాబోయే భార్యపై కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. అయితే కుమార్తెను కాపాడేందుకు వర్ష తల్లి జ్యోతి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో యువరాజ్ కత్తితో దాడి చేసి ఆమెను నరికి చంపాడు. అతడి దాడిలో గాయపడిన వర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన యువరాజ్‌ను అరెస్ట్ చేశారు. హత్యతో పాటు పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.