National Conference on Farooq | ఫరూఖ్‌కు ఈడీ సమన్లు కొత్తేం కాదు
National Conference on Farooq | నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు కొత్త కాదని ఆ పార్టీ ట్వీట్ చేసింది.
National Conference on Farooq | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడం కొత్తేమీ కాదని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. సమన్లు జారీ చేసిన ఈడీకి విచారణలో ఆయన సహకరిస్తారని ట్వీట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31న విచారణకు హాజరు కావాలని ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు.
దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేయడం కొత్తేమీ కాదు. దేశంలోని విపక్ష నేతలందరికీ ఇది సర్వ సాధారణమైంది. ఈ కేసులో ఫరూఖ్ అబ్దుల్లా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్నారు. గతంలో మాదిరే దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు అని తెలిపింది.
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు విచారిస్తారు. ఇదే కేసులో పలుమార్లు ఆయనను ఈడీ విచారించింది. 2020లో ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.11.86 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జేకేసీఎ అధ్యక్షుడిగా వివిధ పదవుల నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

