మంగళవారం 07 జూలై 2020
National - Jun 29, 2020 , 14:36:12

ఇంధ‌న ప‌రిశ్ర‌మ‌కు ఇది గ‌డ్డుకాలం: ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

ఇంధ‌న ప‌రిశ్ర‌మ‌కు ఇది గ‌డ్డుకాలం: ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం కొన‌సాగుతున్న‌ది. రోజురోజుకు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో దాదాపు అన్ని ప్ర‌ధాన దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్నాయి. అయినా, ఇప్ప‌టికీ క‌రోనా ర‌క్క‌సి శాంతించ‌క‌పోవ‌డంతో మున్ముందు మ‌రింత గ‌డ్డుకాలం ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఇప్ప‌టికే జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు భార‌త్ స‌హా వివిధ దేశాలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాలు ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల‌పై కేంద్ర పెట్రోలియం & స‌హ‌జ వాయువులు, ఉక్కు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్పందించారు. 

ప్ర‌పంచ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌తోపాటు భారతదేశ ఆర్థికవ్య‌వ‌స్థ ఇప్పుడు స‌వాళ్లకు ఎదురీదుత‌న్నాయ‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా కొట్టిన దెబ్బకు ప్ర‌స్తుతం ఇంధ‌న ప‌రిశ్ర‌మ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని ప్ర‌ధాన్ పేర్కొన్నారు. ఏప్రిల్‌-మే నెలల్లో దేశంలో పెట్రోల్‌కు డిమాండ్ 70 నుంచి 80 తగ్గింద‌ని, అది ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై నేరుగా ప్ర‌భావం చూపింద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ అభిప్రాయ‌ప‌డ్డారు.     


logo