న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భవనా ఏరియాలో గ్యాంగ్‌స్టర్ రాంచో, రాజేశ్ భవనియా గ్యాంగ్‌లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు ఆయుధాలు, 10 కార్ట్రిడ్జెస్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోని మైదాన్ గర్హి ఏరియాలో గత రాత్రి ఘోరం జరిగింది. 36 ఏండ్ల ప్రాపర్టీ డీలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనాస్థలిలో రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఏరియాను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రాపర్టీ డీలర్ హత్యపై విచారణ జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Gangster Rancho, Rajesh Bawania gang's associate was intercepted today morning. During encounter he sustained bullet injury on his leg & was shifted to hospital, his condition is stable. 2 weapons & 10 cartridges were seized: Brijendra Kumar Yadav, DCP Outer North District pic.twitter.com/dnoPe6CwPr
— ANI (@ANI) November 11, 2021