కుల్గామ్, అనంతనాగ్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కుల్గామ్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో అనంతనాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలోని హంగల్గుండ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు.. భద్రతా బలగాలు ఆయా ప్రాంతాలకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలోనే ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారు జామున అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బిజ్బిహారాలోని బాద్షాహీ బాగ్ సమీపంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్‌లో ఉండగా.. దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ దాడితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

