Encounter | గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆరుగంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో సోదాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
సంఘటనా స్థలంలో మూడు ఏకే47లు, కార్బైన్, ఎస్ఎల్ఆర్ సహా ఏడు ఆటోమేటెడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగడ దళం ఇన్చార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం ఉన్నట్లు గుర్తించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య వందోలియా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో సీ60కి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు జవాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరిని నాగ్‌పూర్‌కు తరలించినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

