అంబాల: వ్యవసాయ వ్యర్థాలను దహనం చేస్తున్న వారిని గుర్తించడానికి వచ్చిన అధికారులను హర్యానాలోని అంబాల జిల్లా రైతులు నిర్బంధించారు. హర్యానా స్పేస్ అప్లికేషన్ సెంటర్ పంపిన ఫొటోల ఆధారంగా తనిఖీలు చేసి, సంబంధిత రైతులకు చలాన్లు విధించడానికి పట్వారీ, ఇతర వ్యవసాయ అధికారుల బృందం అంబాల జిల్లాలోని కచువా గ్రామానికి చేరుకుంది.
ఇది తెలిసిన గ్రామస్తులు, రైతులు వారి వాహనాన్ని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వారిని నిర్బంధించారు. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలని, వ్యవసాయ పరికరాల కొనుగోలులో సబ్సిడీ ఇవ్వాలని, చలాన్లను నిలిపివేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.