నేడు మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్!
మే 2న మీ మొబైల్ ఫోన్‌కు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలర్ట్ మెసేజ్ రావొచ్చు. దాన్ని చూసి కంగారు పడకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నారు.
- డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్‌ను పరీక్షించనున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : మే 2న మీ మొబైల్ ఫోన్‌కు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలర్ట్ మెసేజ్ రావొచ్చు. దాన్ని చూసి కంగారు పడకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి, ఇతర విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం సాచెట్ అనే కొత్త వ్యవస్థను తయారు చేసింది.
ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు టెలికం శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. పెద్ద శబ్దంతో మెసేజ్ వస్తే మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. దానికి స్పందించడం, సమాధానం ఇవ్వాల్సిన అవసరమూ లేదు. అత్యవసర సమయాల్లో కీలక సమాచారం వేగంగా ప్రజలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఒక అధికారి తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

