Elon Musk : టెస్లా ఇంక్ (Tesla Ink) అధినేత ఎలాన్ మస్క్ (Elan Musk) 2025 ఆర్థిక సంవత్సరానికిగాను 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని పొందారు. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ (Regulatery filing) లో ఆయన ప్యాకేజీని కంపెనీ పేర్కొన్నది. భారత కరెన్సీ (Indian currency) లో ఇది దాదాపు రూ.15 లక్షల కోట్లుగా ఉన్నది. ఎలాన్ మస్క్ నెలవారీ వేతనంగా ఎలాంటి మొత్తాన్ని పొందడం లేదు. స్టాక్ అవార్డులు, ఇతరత్రా రూపంలో పారితోషిక ప్యాకేజీని అందుకుంటారు. ఈ క్రమంలో 2025 సంవత్సరానికిగాను ఆయన ప్యాకేజీని టెస్లా ప్రకటించింది.
అయితే ప్రకటించిన మొత్తంతో పోలిస్తే ఆయన పొందే విలువకు చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా టెస్లా తన ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ పనితీరు ఆధారిత పారితోషికం విలువ 132 బిలియన్ డాలర్లుగా ఉన్నది. పనితీరు విషయంలో కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరితేనే ఈ మొత్తం మస్క్‌కు అందుతుంది. అలాగే ప్యాకేజీలో మిగతా 26 బిలియన్ డాలర్లు కూడా టెస్లా బోర్డు ఆమోదిస్తేనే అందుతుంది.