న్యూఢిల్లీ: స్పేస్ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్(Elon Musk).. తన కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నట్లు ఓ రిపోర్టు రిలీజైంది. అందులో ఒక మహిళ ఇంటర్నె కాగా, మరో మహిళను పిల్లలు కనాలని వత్తిడి చేసినట్లు ఆ రిపోర్టులో తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ దీనికి సంబంధించిన ఓ కథనాన్ని రాసింది. మస్క్ తన వ్యవహార శైలితో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల్లో మహిళలకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించినట్లు ఆ కథనంలో ఆరోపణలు చేశారు.
ఇటీవల మస్క్‌పై వరుసగా రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టసీ, మష్రూమ్స్, కీటమైన్ లాంటి మాదకద్రవ్యాలను వాడినట్లు మస్క్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కంపెనీలో వర్క్ ఎన్విరాన్మెంట్ను పాడు చేసినట్లు మస్క్‌పై గతంలో ఆరోపణలు చేశారు. మహిళా ఉద్యోగినులను వేధిస్తూ జోక్‌లు చేసేవారట. పురుషుల కన్నా మహిళా ఉద్యోగినులకు తక్కువ జీతం ఇచ్చేవారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించేవాళ్లు. పని ప్రదేశంలో సెక్సిస్ట్ కల్చర్‌ను డెవలప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2013లో స్పేస్ఎక్స్ సంస్థను వీడిన ఓ మహిళ మస్క్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో శృంగారంలో పాల్గొని, పిల్లలను ప్రసవించాలని మస్క్ వత్తిడి చేసినట్లు ఓ మహిళ ఆరోపించింది. జనాభా సంక్షోభంతో ప్రపంచం ఇబ్బందిపడుతుందని, అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులను ఎక్కువగా సృష్టించాలని మస్క్ చెప్పేవాడని ఆ మహిళ ఆరోపించింది. మస్క్‌కు ఇప్పటికే పది మంది పిల్లలు ఉన్నారు. మస్క్, ఆ మహిళ మధ్య జరిగిన సంభాషణకు చెందిన టెక్ట్స్‌ను ప్రచురించారు.