ఏ జంతువులైనా తమ పిల్లలను కంటికిరెప్పలా చూసుకుంటాయి. అనుక్షణం వాటి వెంటే ఉండి కాపాడుకుంటాయి. మనుగడ సాగించేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తాయి. కాగా, బెంగాల్ నదిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడిన తల్లి ఏనుగు కాపాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఉత్తర బెంగాల్లోని నగ్రకట సమీపంలో చిత్రీకరించారు. ఈ వీడియోలో ఏనుగుల గుంపు నదిని దాటుతోంది. అయితే, చివరలో ఓ పిల్ల ఏనుగు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది. నీటిలో మునిగిపోతుండగా తల్లి ఏనుగు వచ్చి దాన్ని కాపాడింది. అనంతరం దాని తొండాన్ని పట్టుకొని అవతలి ఒడ్డుకు చేర్చింది. ఈ హృదయపూర్వక వీడియో నెటిజన్లను కట్టిపడేసింది.
Mother elephant saving calf from drowning is the best thing you watch today. Video was shot near Nagrakata in North Bengal. Via WA. pic.twitter.com/aHO07AiUA5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 25, 2022