న్యూఢిల్లీ, ఆగస్టు 26: పెంపుడు జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రవేశించింది. స్నజల్స్ పేరుతో న్యూట్రిషన్ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్టు కంపెనీ ప్రెసిడెంట్ అనిల్ చౌగ్ తెలిపారు.
ప్రస్తుతం రూ.5,500 కోట్ల స్థాయిలో ఉన్న పెట్ ఫుడ్ మార్కెట్ విలువ ప్రతియేటా 10-12 శాతం వృద్ధితో వచ్చే ఐదేండ్లలో రూ.20 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.