Elephant | ఓ పిల్ల ఏనుగు బెడ్ కోసం ఫైట్ చేసింది. అది కూడా తోటి ఏనుగుతో కాదు.. జూ కీపర్‌తో. పిల్ల ఏనుగు తన ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చింది. సమీపంలో బెడ్‌పై పడుకొని ఉన్న జూ కీపర్ వద్దకు వెళ్లింది. అతన్ని బెడ్ పై నుంచి తోసి వేసేందుకు యత్నించింది. కానీ ఆ జూ కీపర్ మాత్రం బెడ్‌ను వదలకుండా అలానే ఉండిపోయాడు. ఏనుగు కూడా అతన్ని బలవంతంగా తోసింది.
ఆ తర్వాత పరుపును ఆక్రమించునేందుకు యత్నించగా, జూ కీపర్ మళ్లీ దానిపై పడుకున్నాడు. మరోసారి బెడ్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఏనుగు అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. కోపంతో తొండెంతో పొదలను చిందర వందర చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. హేయ్ దట్స్ మై బెడ్.. గేటప్ అనే ట్యాగ్ ఉంచారు.
Hey! That’s my bed..get up..😠 pic.twitter.com/WX4IaROsvp
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) May 10, 2022