తిరువనంతపురం: కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి ఒక పెద్ద ఏనుగు ఎదురుపడింది. దానిని చూసి అతడు ఆగాడు. ఆ ఏనుగు అతడికి దగ్గరగా వచ్చింది. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి బైక్‌ను వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో ఆ ఏనుగు ఆ బైక్‌ను వెంబడించింది. (Elephant Chasing Biker) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి బైక్‌పై ప్రయాణించాడు. తిరునెల్లి అటవీ ప్రాంతంలో పెద్ద ఏనుగు వారికి ఎదురుగా వచ్చింది. దీనిని చూసి ఆ వ్యక్తిని బైక్‌ను నిలిపాడు.
కాగా, ఏనుగు వారి దగ్గరకు వచ్చింది. ఇది చూసి ఆ వ్యక్తి భయంతో బైక్‌ను వేగంగా నడిపాడు. దీంతో ఏనుగు ఆ బైక్‌ను వెంబడించింది. అయితే ఆ బైక్‌పై ఉన్న వారు ఆ ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
మరోవైపు అదే మార్గంలో వెళ్తున్న కారులోని వ్యక్తులు దీనిని చూశారు. ఏనుగు బైకర్‌ను వెంబడించడం చూసి తమ వాహనాన్ని వెనక్కి మళ్లించారు. ఆ కారులోని వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A three-member family had a narrow escape from a wild elephant near Appappara, close to Thirunelly in #Kerala‘s Wayanad district
The family was traveling on a bike when they suddenly found themselves face-to-face with a tusker just after negotiating a curve. Thanks to the quick… pic.twitter.com/MKrc4gZlL1
— The Times Of India (@timesofindia) January 20, 2025