Volvo C40 | వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్‌గా గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన బ్రాండ్‌గా పేరున్నది. ఛత్తీస్‌గఢ్‌లో కారు రన్నింగ్‌లో ఉండగానే.. ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో వెంటనే కారులు నిలిపివేసి.. అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చారు. ప్రమాదంలో వోల్వో సీ40 రీచార్జ్ మోడల్ కారు మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కారును ఓనరే వీడియో రికార్డ్ చేశారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు.
ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నారు. ఈవీ వాహనాల్లో మంటలు చెలరేగడానికి కారణాలను డీఆర్డీవో పరిశోధించింది. ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (BMS)లో ప్రధాన సాఫ్ట్వేర్ లోపం ఉందని పేర్కొంది. మంటలు చెలరేగిన వాహనాలకు సరైన వెంటింగ్ మెకానిజం లేదని తేలింది. ఈవీ కారులో మంటలు చెలరేగడంతో ఇదే తొలిసారేం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా చాలా ఈవీ వాహనాల్లో మంటలు చెలరేగాయి. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఒకినావా, ఓలా స్కూటర్లలోనూ మంటలు చెలరేగాయి. ఇటీవల బెంగళూరులోని జేపీ నగర్ ప్రాంతంలోని దాల్మియా సర్కిల్ సమీపంలో మహీంద్రా ఈ2ఓ కారులో మంటలు చెలరేగాయి.
Unbelievable to see an Volvo EV catching fire !
May be hybrid is the real way forward in Indian weather conditions ?
— Prashanth Rangaswamy (@itisprashanth) January 29, 2024