Electric car | నడిరోడ్డుపై అగ్నికి ఆహుతైన ఎలక్ట్రిక్ కారు.. Video viral
Electric car | విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది.
బెంగళూరు: విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బెంగళూరు సిటీలోని జేపీ నగర్లో గల దాల్మియా సర్కిల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై జేపీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులోంచి మంటలు రావడం గమనించి అందులో ఉన్నవాళ్లు బయటికి వచ్చారని, ఆ తర్వాత కారు మంటల్లో దగ్ధమైందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడంతో విద్యుత్ వాహనాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పగటిపూట వేడిని తట్టుకోలేక ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీల్లో మంటలు చెలరేగుతున్నాయని, ఆ తర్వాత వాహనాలు తగులబడి పోతున్నాయని, ఇది ఆ వాహనాల్లో ప్రయాణించే వారి ప్రాణాల మీదకు తెస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.
#Bengaluru: An #electric #car caught #fire near Dalmia Circle in #JPNagar area today. No casualties. Reason is yet to be ascertained.#Karnataka #EV #ElectricVehicles #india pic.twitter.com/z7rVVxgJSn
— Siraj Noorani (@sirajnoorani) September 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

