Lalu Yadav : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ల ద్వారా ఎన్నికలు నిర్వహిండచడంవల్ల అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చనేది రుజువు కూడా అయ్యిందని ఆర్జేడీ అధ్యక్షుడు (RJD President), కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
ఈవీఎంలకు బదులుగా మునుపటిలా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని లాలూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే పారదర్శకత ఉంటుందని చెప్పారు. అదేవిధంగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఫుల్ మెజారిటీ వస్తుందని అన్నారు.
#WATCH | Delhi: Former Bihar CM and RJD chief Lalu Yadav says, “Our party will win the Bihar elections to be held next year. We will get the majority…”
On EVMs, he says, ‘Yes, it (elections) should be conducted using ballot papers.” pic.twitter.com/FKcySsvQuI
— ANI (@ANI) November 29, 2024