దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే షెడ్యూల్ను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఈసీ పూనుకుంది. దీనికోసం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఈ ఎన్నికల నిర్వహణ గురించి 309 జిల్లాల్లో ఈసీ సర్వే జరిగింది. మొత్తం 11 వేల మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీరిలో 41 శాతం మంది ఎన్నికల ర్యాలీలకు వ్యతిరేకంగా ఉన్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని, వాటిని వాయిదా వేయాలని 31 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగు శాతం మంది ప్రజలు మాత్రమే ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తి జరగదన్నారు.