న్యూఢిల్లీ: లోక్సభ, శాసనసభల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ల లెక్కింపులో మరింత పారదర్శకత తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం, ఓట్ల లెక్కింపు కేంద్రంలో పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చివరి నుంచి రెండో రౌండ్ ఈవీఎంలో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఈ విధానాన్ని రానున్న బీహార్ శాసన సభ ఎన్నికల నుంచి ప్రారంభిస్తారు.
పోస్టల్ బ్యాలట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే, రిటర్నింగ్ అధికారులు తగిన సంఖ్యలో టేబుళ్లను, ఓట్ల లెక్కింపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈసీ చెప్పింది. ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా చూడాలని పేర్కొంది. దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. దీంతో పోస్టల్ బ్యాలట్ల సంఖ్య పెరుగుతున్నది.