న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ(Bihar SIR) కింద 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఆ 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఓటర్ల జాబితాను రిలీజ్ చేశారు. ఆగస్టు 19వ తేదీలోగా డిలీట్ అయిన పేర్లను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. ఆగస్టు 22వ తేదీలోగా ఆ నివేదికను కోర్టు ముందు సమర్పించాలని సుప్రీం పేర్కొన్నది. సవరించిన ఓటర్ల జాబితాలో.. ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్ ఓటర్లు ఉన్నారు. ఏఎస్డీ జాబితాను రోహతాస్, బెగుసురాయి, అర్వాల్ పోలింగ్ బూత్‌ల్లో ప్రదర్శించినట్లు బీహార్ సీఈఓ తెలిపారు.